ఇండియా: ఒక్క రోజులో 6,155 కోవిడ్ పాజిటీవ్ కేసులు 11 మరణాలు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 6,155 తాజా కోవిడ్ 19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 31,194 కు పెరిగింది. ఈ 24 గంటల్లో 11 మంది కోవిడ్ కారణంగా మరణించారు.

Advertisement
Update:2023-04-08 12:37 IST

ఇండియా: ఒక్క రోజులో 6,155 కోవిడ్ పాజిటీవ్ కేసులు 11 మరణాలు

మనదేశంలో రోజు రోజుకు మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల క్రితం రోజుకు పదుల సంఖ్యల్లో వచ్చే కోవిడ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 6,155 తాజా కోవిడ్ 19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 31,194 కు పెరిగింది. ఈ 24 గంటల్లో 11 మంది కోవిడ్ కారణంగా మరణించారు.

ఇప్పుడు దేశంలో COVID19 కేసుల సంఖ్య 4.47 కోట్ల (4,47,51,259)కు చేరుకుంది. ఈ రోజు 11 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,30,954కి చేరుకుంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతం, వారంవారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా నమోదైంది.

ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,89,111కి చేరుకోగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

Tags:    
Advertisement

Similar News