ఆన్‌లైన్ గేమ్స్‌లో అత్యధిక‌ వాటా భారత్‌దే..

మొబైల్‌ ద్వారా గేమ్స్‌ ఆడుతున్నవారు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారని పేర్కొంది లుమికాయ్ సంస్థ. భారత్‌లో ఇంటర్నెట్ ఆధారిత గేమింగ్ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోందని వెల్లడించింది. దేశీయ గేమింగ్‌ మార్కెట్‌ ఏడాదికి 27 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని పేర్కొంది.

Advertisement
Update:2022-11-04 11:01 IST

భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే ఐదేళ్లలో భారత్‌లో గేమింగ్ మార్కెట్ విలువ 71 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. అంటే ప్రపంచంలోనే ఆన్‌లైన్ గేమింగ్‌లో అత్యధిక వాటా భారత్‌కే దక్కుతుందన్నమాట.

ప్రస్తుతం మన దేశంలో 50 కోట్లకు పైగా గేమర్స్‌ ఉన్నారు. ఇందులో మూడొంతుల మంది ఉచితంగా ఆన్‌లైన్‌లో గేమ్స్ అడుతుంటారు. మిగతావారు వాటికి బాగా అలవాటు పడిపోయారు. 12 కోట్ల మంది డబ్బులు చెల్లించి ఆన్‌లైన్‌లో గేమ్స్ అడుతుంటారు. వీరి కోసం ప్రీమియం గేమ్స్ అందుబాటులో ఉంటాయి. ఒకసారి వీటికి అలవాటు పడితే ఇక ఉచిత గేమ్స్ జోలికి ఎవరూ వెళ్లరు. ప్రస్తుతం భారత్‌లో డేటా వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్‌కి ఇది మరింత ఊతం ఇస్తోంది.

హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా గేమ్‌ డెవలపర్స్‌ సదస్సులో 'స్టేట్‌ ఆఫ్‌ ఇండియా గేమింగ్‌ ఎఫ్‌వై 2022' నివేదికను లుమికాయ్ సంస్థ విడుదల చేసింది. 2021-22లో భారత్‌లో 1,500 కోట్ల మొబైల్ గేమ్ డౌన్‌ లోడ్స్‌ జరిగాయని ఆ సంస్థ తెలిపింది. మొబైల్‌ ద్వారా గేమ్స్‌ ఆడుతున్నవారు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారని పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ ఆధారిత గేమింగ్ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోందని వెల్లడించింది. దేశీయ గేమింగ్‌ మార్కెట్‌ ఏడాదికి 27 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 900 గేమింగ్‌ కంపెనీలు ఉన్నాయి. 2021లో గేమింగ్ పరిశ్రమలో 3 యూనికార్న్ సంస్థలు ఆవిర్భవించాయి. ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకి కూడా రావడం విశేషం. 2021-22లో 260 కోట్ల డాలర్లుగా ఉన్న గేమింగ్ మార్కెట్‌ 2026-27 నాటికి 860 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. గత ఐదేళ్లలో భారత గేమింగ్‌ కంపెనీలు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ.22,960 కోట్ల నిధులు సమీకరించాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహా వృద్ధి కనపడే అవకాశాలున్నాయి. ఐదేళ్లలో భారత గేమింగ్ మార్కెట్ 71వేల కోట్ల రూపాయలకు చేరుకోబోతోంది.

Tags:    
Advertisement

Similar News