పెళ్లి బారాత్‌‌లో సడెన్ స్ట్రోక్‌తో వరుడు మృతి

పెళ్లి ఊరేగింపు బారాత్‌లో గుండెపోటుతో వరుడు మృతి చెందాడు

Advertisement
Update:2025-02-16 15:12 IST

ప్రస్తుతం చిన్నపెద్దా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ పెళ్లికొడుకు ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శ్యోపుర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన వరుడు ప్రదీప్ మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కడు. కాసేటికే అతడు అస్వస్ధతకు గురికావడంతో సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో పెళ్లి కొడుకు చనిపోయి ఉంటాడని డాక్టర్ తెలిపారు.

గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 25 నుంచి 30 సంవత్సరాల వయసులోపు వారే ఎక్కువగా ఉన్నట్టుండి కుప్పకూలి అకస్మాత్తుగా మరణిస్తున్నారు. కరోనా పీరియడ్ తర్వాతే ఇటువంటి అన్ నేచురల్ డెత్స్ పెరిగినట్లు కొన్ని నివేదికలు స్ఫష్టంచేస్తున్నాయి.డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, పరిగెత్తుతూ ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇటువంటి ఘటనలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News