తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గుడ్‌ న్యూస్‌

వారానికి రెండు సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ సీఎం నిర్ణయం

Advertisement
Update:2024-12-30 16:04 IST

తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వారానికి రెండు బ్రేక్‌ దర్శనాలతో పాటు రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు ఇవ్వడానికి అనుమతించారు. సోమవారం అమరావతిలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వారి సిఫార్సు లేఖలకు చంద్రబాబు అంగీకరించారని బీఆర్‌ నాయుడు మీడియాకు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో మినహా వారానికి రెండు బ్రేక్‌, రెండు రూ.300 టికెట్ల దర్శనానికి వారు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News