దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయూన్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి రక్షణగోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ఇప్పటివరకు 29 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది ఉన్నారు. వీరిలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. బ్యాంకాక్ నుంచి ముయూన్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది.
Advertisement