ఐఎస్‌ఐకి బ్రహ్మోస్‌ రహస్యాలు.. శాస్త్రవేత్తకు జీవిత ఖైదు

నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్‌ సంస్థకు చెందిన మిస్సైల్‌ కేంద్రంలోని టెక్నికల్‌ రీసెర్చ్‌ సెక్షన్‌లో నిశాంత్‌ విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో సంస్థకు చెందిన అత్యంత కీలకమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐకి లీక్‌ చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి.

Advertisement
Update:2024-06-03 17:45 IST

బహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఇంజినీర్‌ నిశాంత్‌ అగర్వాల్‌కు జీవిత ఖైదు విధిస్తూ నాగ్‌పూర్‌ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి రహస్యాలు చేరవేశారనే ఆరోపణలు రుజువు కావడంతో అధికారిక రహస్యాల చట్టం కింద న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. ఈ శిక్షలో భాగంగా అతను 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మరో రూ.3 వేల జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్‌ సంస్థకు చెందిన మిస్సైల్‌ కేంద్రంలోని టెక్నికల్‌ రీసెర్చ్‌ సెక్షన్‌లో నిశాంత్‌ విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో సంస్థకు చెందిన అత్యంత కీలకమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐకి లీక్‌ చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అతను అరెస్టయ్యాడు. తర్వాత పలు సెక్షన్ల కింద అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం తాజాగా నాగ్‌పూర్‌ కోర్టు అతనికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. డీఆర్డీఓ, రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్‌ కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్‌ సంస్థను నిర్వహిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News