మహిళలకు ప్రతి నెల రూ. 2,100 ఆర్థిక సాయం

మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఆప్‌ కన్వీనర్‌ ప్రకటన

Advertisement
Update:2024-12-12 16:27 IST

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే సొంతబలంతోనే ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన హామీల వర్షం కురిపించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2,100 ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు.

'నేను ప్రతి మహిళలకు రూ. వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చాను. ఈ ప్రతిపాదనకు గురువారం ఉదయం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మరో 10-15 రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ డబ్బు మహిళల ఖాతాల్లో బదిలీ చేయడం సాధ్యం కాదు. మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా ఆ మొత్తం చాలదని కొంతమంది మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే నెలకు రూ. 2,100 ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి సంబధించి ఎంపిక కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఢిల్లీ ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల వరకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇస్తామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. దీంతోపాటు రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తామని, వారి కూతుళ్ల పెళ్లిళ్లకు రూ. లక్ష ఆర్థిక సాయం, ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్‌ కింద ఏడాదికి రెండుసార్లు రూ. 2,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News