పసిపాప గొంతు కోసిన నానమ్మ.. ప్రాణం పోసిన డాక్టర్లు
అప్పుడే పుట్టిన ఆడపిల్ల గొంతు కోసం చెత్తకుండీలో పడేసిన ఆమె నానమ్మ
Advertisement
తుంచిన పసిమొగ్గకు డాక్టర్లు ప్రాణం పోసిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో అప్పుడే పుట్టిన ఆడపిల్ల (పిహు) గొంతు కోసి చెత్తకుండీలో పడేసింది ఆమె నానమ్మ. ఆ బిడ్డకు భోపాల్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రి డాక్టర్లు నెలరోజుల పాటు చికిత్స అందించి బతికించారు. పాప గొంతు కోసినా కీలకమైన ధమనులు, సిరలు తెగలేదని.. అందువల్లే పలు శస్త్రచికిత్సలు చేసి ఆమెను బతికించగలిగామని వైద్య సిబ్బంది తెలిపింది. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో మృత్యువును జయించిన చిన్నారిని రాజ్‌గఢ్‌లోని ఓ ఆశ్రయ కేంద్రానికి తరలించామని ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్ ధీరేంద్ర శ్రీవాత్సవ్ తెలిపారు.
Advertisement