త్రివేణీ సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం
ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో త్రివేణి సంగమ స్థలి వద్ద అమృత పుణ్యస్నానం ఆచరించారు. అంతకు ముందు యూపీ సీఎం సీఎం యోగి ఆదిత్యనాధ్‌తో కలిసి బోట్ పడవలో త్రివేణి సంగమంలో ప్రయాణించి అక్కడి ఘాట్ లో ఉన్న భక్తులకు అభివాదం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో హెలికాప్టర్లో కుంభమేళా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు సీఎం యోగి స్వాగతం పలికారు. మహాకుంభమేళాకు ప్రధాని మోడీ హాజరైన సందర్భంగా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎన్.ఎస్.జీ భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగనుంది.
144ఏళ్లకు ఒకసారి..మనిషి జీవితంలో ఒకేసారి వచ్చే మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ, విదేశాలు నుంచి కూడా భక్తులు తరలిరావడం జరిగింది. ఈ సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయనున్నారు. అనంతరం సాధు సంతువులతో సమావేశం కానున్నారు. మహా కుంభ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మహా కుంభమేళా 24వ రోజు కొనసాగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.