మహారాష్ట్ర ఎన్నికల ఫలితలపై ఈసీ క్లారిటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈవీఎం అవకతవకలపై విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగం జరిగిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో 1,445 వీవీప్యాట్‌లను ఆయా ఈవీఎంలలో పోలైన ఓట్లతో క్రాస్ చెక్ చేయగా ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి స్థానంలో ఐదు చొప్పునా వీవీప్యాట్‌లను లెక్కించినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయ సాధించింది. అదేవిధంగా మునుపెన్నడూలేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో జెండాపాతి రికార్డును సృష్టించగా, శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి.