వయనాడ్‌ ప్రజలు ఓ ఛాన్స్‌ ఇస్తారని భావిస్తున్నా

వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రియాంక వెల్లడి

Advertisement
Update:2024-11-13 10:56 IST

వయనాడ్‌ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయనాడ్‌ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వక్ఫ్‌ చట్టం గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఇవాళ ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదంటూ సమాధానమిచ్చారు. 

వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజారిటీతో రాహుల్‌గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌.. సీపీఐ నాయకురాలు అన్నీరాజాపై 3.6 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంతో ఆపటు యూపీలోని రాయ్‌బరేలీలోనూ గెలవడంతో వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రియాంకను ఐదు లక్షల మెజారిటీతో గెలిపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రియాంకను ఐదు లక్షల మెజారిటీతో గెలిపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక వయనాడ్‌లో పార్టీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించి.. కీలక పాత్ర పోషించారు. కేరళలోని పాలక్కాడ్‌, చెలక్కర అసెంబ్లీ స్థానాలతోపాటు వయనాడ్‌ లోక్‌షభ ఉప ఎన్నిక నేడు జరుగుతున్నది. నవంబర్‌ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Tags:    
Advertisement

Similar News