ఢిల్లీ ఘటన రైల్వేశాఖ నిర్లక్ష్యం, నిర్వహణ లోపం : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిలాసట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement
Update:2025-02-16 12:56 IST

దేశ రాజధాని ఢిల్లీ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్యాసింజర్‌ల రద్దీని నియంత్రించడంలో నార్తర్న్ రైల్వే శాఖ, కేంద్రం విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన రైల్వేశాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. యూపీ ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే ప్రయాణికుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతే. మరణించిన, గాయపడినవారి ఖచ్చితమైన సంఖ్య ఎప్పుడు తెలుస్తాయి?. రద్దీ నియంత్రణకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కుంభమేళా నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఎందుకు నడపలేదు?’ అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సైతం ఇలాంటి ఆరోపణలు చేశారు. ఈ ఘోర దుర్ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే దిగ్భాత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవవైపు తొక్కిసలాట ఘటనపై రైల్వే నార్తర్న్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ స్పందించారు. 14-15 ఫ్లాట్ ఫామ్స్ వైపుగా వస్తున్న ప్రయాణికులు మెట్లపై జారిపడినట్లు తెలిపారు. దీంతో వెనుక నుంచి వారు నెట్టుకోగా తొక్కిసలాటా జరిగిందని సీపీఆర్‌ఓ తెలిపారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు. మరోవైపు నిలబడేందుకు చోటు లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News