నిప్పుల కొలిమిలా మారిన డిల్లీ, తొమ్మిది రోజుల్లో 192 మంది మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది.

Advertisement
Update:2024-06-20 15:33 IST

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండ మరోవైపు నీటి కటకటతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. రాజధానిలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా 35.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిపోతున్నాయి.

ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండాలుగా మారాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాల ప్రకారం జూన్‌ 1 నుంచి 18 మధ్య కాలంలో దాదాపు 40వేల వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట్లు సమాచారం. అయితే, జూన్‌లో కేవలం ఒక్క వారం రోజుల్లోనే దేశ రాజధానిలో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు విడిచారని ఓ స్వచ్ఛంద సంస్ధ పేర్కొంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో 36 వడదెబ్బ మరణాలు చోటుచేసుకోగా బిహార్‌, రాజస్థాన్‌, ఒడిశాలోనూ పదుల సంఖ్యలో మృత్యువాతపడినట్లు జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ ఉష్ణోగ్రత ప్రభావిత అనారోగ్యం, మరణాలపై పర్యవేక్షణ విభాగం వెల్లడించింది. అయితే ఇదంతా రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మాత్రమేనని.. వాస్తవ సంఖ్య ఇంతకంటే అధికంగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి.

జూన్‌ 18న ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయినట్లు తెలిపాయి. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. గత రెండు రోజుల్లో లభ్యమైన మృతదేహాల్లో 80శాతం నిరాశ్రయులు, వలస కూలీలవేనని సీహెచ్‌డీ పేర్కొంది. ఇక ఢిల్లీ RML ఆస్పత్రిలో ఇప్పటికే వడదెబ్బతో 36మంది చికిత్స పొందుతుండగా.. వారిలో లైఫ్ సపోర్ట్‌పై 12మంది రోగులు ఉన్నారు. వీరిలో అధికంగా 60 ఏళ్లు పైబ‌డిన వారే ఎక్కువ. ఇలాగే వేడిగాలులు కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News