రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం
పాల్గొన్న గవర్నర్, సీఎం, మండలి చైర్మన్
Advertisement
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement