అరెస్టు సక్రమమే.. కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కోర్టు
కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి అవసరమైన మెటీరియల్ ఈడీ అధికారుల దగ్గర ఉందని స్పష్టం చేసింది కోర్టు. కేజ్రీవాల్ విచారణకు సహకరించకపోవడం, అందువల్ల జరిగిన జాప్యంతో అప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారిపై ప్రభావం చూపిందని కామెంట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్ తగిలింది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుతో పాటు రిమాండును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు.. తీర్పు వెల్లడించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ సేకరించిన ఆధారాలు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ పాత్రను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది.
కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి అవసరమైన మెటీరియల్ ఈడీ అధికారుల దగ్గర ఉందని స్పష్టం చేసింది కోర్టు. కేజ్రీవాల్ విచారణకు సహకరించకపోవడం, అందువల్ల జరిగిన జాప్యంతో అప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారిపై ప్రభావం చూపిందని కామెంట్ చేసింది. న్యాయస్థానాలు రాజ్యాంగం ఆధారంగా నడుస్తాయని.. రాజకీయాల పరంగా కాదంటూ వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు చట్టానికి కట్టుబడి ఉంటారు తప్ప రాజకీయాలకు కాదని.. తీర్పులు చట్టపరమైన సూత్రాల మీద ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. సాధారణ పౌరులను, ముఖ్యమంత్రిని వేర్వేరుగా చూడలేమని కోర్టు క్లారిటీ ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. మార్చి 22న ఆయనను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది ట్రయల్ కోర్టు. తర్వాత కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.