ఉత్కంఠ పోరులో ఢిల్లీ సీఎం అతిశీ విజయం
కల్కాజీలో బీజేపీ కీలక నేత రమేశ్ బిదూరిపై గెలుపు
Advertisement
ఉత్కంఠ పోరులో ఢిల్లీ సీఎం అతిశీ మర్లేనా విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రమేశ్ బిదూరితో ఆమె హోరాహోరీగా తలపడ్డారు. చివరి మూడు రౌండ్లలో ఎక్కువ ఓట్లు రావడంతో 3,500 ఓట్ల ఆదిక్యంతో రమేశ్ బిదూరిపై అతిశీ విజయం సాధించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అల్క లాంబ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అర్వింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి కీలక నేతల ఓటతో నైరాశ్యంలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు అతిశీ విజయం పెద్ద ఊరటనిచ్చింది.
Advertisement