భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.... హెచ్చరిక‌ జారీ చేసిన‌ WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం విడుదల చేసిన ఎపిడెమియోలాజికల్ నివేదిక ప్రకారం, గత 28 రోజుల్లో భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య 114 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో, కరోనా కేసుల‌ సంఖ్య 437 శాతం పెరిగింది.

Advertisement
Update:2023-04-01 18:16 IST

గత 15 రోజులుగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఆరు నెలల్లో తొలిసారిగా మూడు రోజులపాటు వరసగా ప్రతిరోజూ సుమారు మూడు వేల మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు కారణం కరోనా XBB.1.16. ఇది చాలా ఎక్కువ ఇన్‌ఫెక్షన్ కు కారణమవుతోందని అధ్యయనాలు చెపుతున్నాయి.

గత నెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన ఎపిడెమియోలాజికల్ నివేదిక ప్రకారం, గత 28 రోజుల్లో భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య 114 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో, కరోనా కేసుల‌ సంఖ్య 437 శాతం పెరిగింది.

నివేదిక ప్రకారం, ఆగ్నేయాసియా ప్రాంతంలో 27,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత నెల‌ రోజులతో పోలిస్తే 152 శాతం ఎక్కువ‌. భారతదేశంలో అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు రాగా, తర్వాత మాల్దీవులు 129 శాతం, నేపాల్ 89 శాతం కేసులు వచ్చాయి.

అదేవిధంగా, భారతదేశంలో కనీసం 62 మరణాలు నమోదయ్యాయి, అంటే ఈ సంఖ్య‌ 114 శాతం పెరుగుదలను సూచిస్తోంది. కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులపై అన్ని దేశాలు సీరియస్‌గా దృష్టి సారించాలని, ఇవి మరిన్ని కొత్త సవాళ్లను సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ XBB.1.16ని నిత్యం పర్యవేక్షిస్తున్నది.

కోవిడ్ కేర్ నిపుణులు డాక్టర్. శ్రేయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ''సాధారణంగా ఓమిక్రాన్ వేరియంట్, దాని అన్ని సబ్-వేరియంట్‌లలో ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. డెల్టా వేరియంట్ లాగా ఎక్కువ మరణాలు ఈ వేరియంట్ లో ఉండవు .'' అని చెప్పారు. కరోనా కేసుల్లో పెరుగుదల ఉన్నంత వరకు, దానిని నివారించడానికి ప్రజలందరూ కోవిడ్ నియమాలను పాటించాలని, సంక్రమణ వేగాన్ని తగ్గించడానికి ఇది ఏకైక మార్గమని ఆయన తెలిపారు.

మాస్క్ లు ధరించడం, సమూహాల్లోకి వెళ్ళకపోవడంతో పాటు గత కరోనా కాలంలో పాటించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News