"WWW" కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..
పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో 25 గ్యారంటీలు ఇచ్చారు.
"WWW" కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..
‘పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్’ కలుపుకుని.. "న్యాయ్ పత్ర" పేరుతో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. వర్క్, వెల్త్, వెల్ఫేర్ ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత పదేళ్లలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల జీవితాల్లో వెలుగులు తెస్తామని హస్తం పార్టీ భరోసా ఇచ్చింది.
పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో 25 గ్యారంటీలు ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే, బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్‌ను రద్దు చేస్తామన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ , పెగాసెస్, రాఫెల్‌పై విచారణ జరుపుతామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 5 న్యాయాలు
1. ‘యువ న్యాయ్’
ప్రతి విద్యావంతుడికి అప్రంటీస్‌గా పనిచేసే అవకాశం
ఒక్కొక్కరిపై రూ.లక్ష ఖర్చు
2. ‘మహిళా న్యాయ్’
ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు
3. ‘కిసాన్ న్యాయ్’
రైతులకు రుణమాఫీ
స్వామి నాథన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
4.‘శ్రామిక్ న్యాయ్’
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం రూ.400కు పెంపు
5.‘హిస్సేదార్ న్యాయ్’
సామాజిక, ఆర్థిక సమానతల కోసం కులగణన
మేనిఫెస్టోలోని కీలక హామీలు:
- అగ్నిపథ్ పథకం రద్దు
- జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
- కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు
- ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
- పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
- యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు
- రైట్ టూ అప్రంటీస్ చట్టం
- ఆశ, అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్స్‌కు డబుల్ శాలరీ
- మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్‌లాను ఎంచుకునే హక్కు ఇస్తాం
- తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టాన్ని సవరిస్తాం
- మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు చేస్తాం, ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.