దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు.. కాంగ్రెస్ నేత కొత్త వివాదం

వివాదంపై కాంగ్రెస్‌ సైతం స్పందించింది. పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం అని తెలిపింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం, కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు సీనియర్ లీడర్ జైరాం రమేష్.

Advertisement
Update:2024-05-08 16:58 IST

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌నేత శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. అది మరువక ముందే కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

పిట్రోడా ఏమన్నారంటే..

"మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బుల్లా కన్పిస్తారు. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. మనమంతా అన్నదమ్ముల్లా కలిసిపోయి ఉంటాం" అన్నారు.

బీజేపీ ఆగ్రహం.. కాంగ్రెస్ వివరణ

భారతీయుల రూపురేఖలపై శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్ అయ్యారు. తాను ఈశాన్యానికి చెందిన వ్యక్తిని.. కానీ భారతీయుడిలానే కనిపిస్తా అన్నారు. మనదేశం గురించి కనీస జ్ఞానం తెలుసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. వివాదంపై కాంగ్రెస్‌ సైతం స్పందించింది. పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం అని తెలిపింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం, కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు సీనియర్ లీడర్ జైరాం రమేష్.

Tags:    
Advertisement

Similar News