మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ

బీజేపీ ప్రభుత్వంలో అవినీతి, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని విమర్శించారు. గత మూడేళ్లలో బీజేపీ పాలకులు రాష్ట్రానికి ఏం చేశారని ఆమె నిల‌దీశారు.

Advertisement
Update:2023-06-12 15:05 IST

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ఆమె భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ర్యాలీకి ముందు ప్రియాంక గాంధీ జబల్ పూర్ లో నర్మదా నదీ తీరాన ప్ర‌త్యేక పూజలు చేశారు. ప్రియాంక గాంధీ తో పాటు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్, పార్టీ ఎంపీ వివేక్ ఠంకా, ఇతర నేతలున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో అవినీతి, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని విమర్శించారు. గత మూడేళ్లలో బీజేపీ పాలకులు రాష్ట్రానికి ఏం చేశారని ఆమె నిల‌దీశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మీ జీవితాలు ఏమైనా మెరుగుపడ్డాయా..? అని ప్రజలను ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పిందన్నారు.

జబల్ పూర్ మహాకోశల్ ప్రాంతానికి కేంద్రమని.. ఇక్కడ గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ నగరం రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. అనంతరం పార్టీ నేత వివేక్ ఠంకా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ ప్రాంతం నుంచి వెళ్లకపోవడంతో ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని జబల్ పూర్ నుంచి ప్రారంభించారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News