పోస్టల్‌ బ్యాలెట్లకు ఆర్వో సీల్‌ లేకున్నా ఓకే.. - ఎన్నికల సంఘం ఆదేశాలు

ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఏపీ చీఫ్‌ ఎలక్టోరియల్‌ ఆఫీసర్‌ (సీఈవో) ముఖేష్‌కుమార్‌ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదివారం పంపించారు.

Advertisement
Update:2024-05-26 13:20 IST

దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నవేళ సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (సీఈసీ) పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలెట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతూ చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశలకు గాను శనివారం జరిగిన పోలింగ్‌తో ఆరు దశల పోలింగ్‌ పూర్తయింది. ఇక చివరిదైన ఏడో దశ పోలింగ్‌ జూన్‌ ఒకటో తేదీన జరగనుంది. ఆ తర్వాత జూన్‌ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ దశలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.

ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఏపీ చీఫ్‌ ఎలక్టోరియల్‌ ఆఫీసర్‌ (సీఈవో) ముఖేష్‌కుమార్‌ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదివారం పంపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లపై ఆర్వో సీల్‌ లేకపోయినా.. సంతకం ఉంటే చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. ఫామ్‌ 13ఏపై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని, ఆర్వో సంతకం సహా బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని సూచించారు. ఫామ్‌ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్‌ సీరియల్‌ నంబర్‌ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News