రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
రోడ్డు ప్రమాద క్షతగాత్రుల కోసం కేంద్ర కొత్త పథకం.. ఏడు రోజుల వరకు నగదు రహిత చికిత్స అందిస్తుందన్న కేంద్ర మంత్రి
రోడ్డు ప్రమాద క్షతగాత్రుల కోసం కేంద్రం కొత్త పథకం ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాదాలతో గాయాలైతే ఏడు రోజుల వరకు నగదు రహిత చికిత్స అందిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్రం గరిష్ఠంగా రూ. లక్షన్నర వరకు వైద్య ఖర్చులను భరిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. హిట్ అండ్ రన్ కేసులో మృతులకు రూ. 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని నితిన్ గడ్కరీ వివరించారు. ఢిల్లీలోని రవాణ మంత్రులతో గడ్కరీ సమావేశం నిర్వహించారు. రవాణా విధానాలపై చర్చించారు. రోడ్ల భద్రతే ముఖ్యమన్న కేంద్ర మంత్రి 2024లో 1,80,000 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అందులో 30 వేల మంది హెల్మెట్ లేని కారణంగానే చనిపోయారని వివరించారు. 66 శాతం యాక్సిడెంట్లు 18 నుంచి 34 ఏళ్ల మధ్య వారికే జరుగుతున్నాయన్నారు.