లైఫ్ సీక్రెట్స్ విని.. రూ.69 ల‌క్ష‌లు కాజేసిన క్యాబ్ డ్రైవ‌ర్‌

ఆమె త‌ర‌చూ అత‌ని క్యాబ్‌లోనే వెళుతుండ‌టంతో ఆమె ఫోన్ నంబ‌ర్ తీసుకున్నాడు. వేరొక వ్య‌క్తిలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఆమె లైఫ్ సీక్రెట్స్‌ని బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ప్రారంభించాడు.

Advertisement
Update:2023-08-03 10:13 IST

క్యాబ్‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్న మ‌హిళ ఆమె లైఫ్ సీక్రెట్స్‌, వ్య‌క్తిగ‌త కార్య‌క‌లాపాల స‌మాచారాన్ని అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి రూ.69 ల‌క్ష‌ల న‌గ‌దు, బంగారం లాక్కున్న క్యాబ్ డ్రైవ‌ర్ చివ‌రికి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. బెంగ‌ళూరులో క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న కిర‌ణ్‌కుమార్ (35).. త‌న క్యాబ్‌లో త‌ర‌చూ ఉద్యోగ రీత్యా ప్ర‌యాణిస్తున్న మ‌హిళ ఆ సంద‌ర్భంగా ఫోన్‌లో మాట్లాడుతున్న స‌మాచారాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాడు.

ఆమె త‌ర‌చూ అత‌ని క్యాబ్‌లోనే వెళుతుండ‌టంతో ఆమె ఫోన్ నంబ‌ర్ కూడా తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆమెకు వేరొక వ్య‌క్తిలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఆమె లైఫ్ సీక్రెట్స్‌ని బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరించి ఆమె నుంచి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ప్రారంభించాడు. అత‌ని నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆమె ద‌శ‌ల‌వారీగా రూ.20 ల‌క్ష‌ల న‌గ‌దును అత‌ని బ్యాంకు ఖాతాలో వేసింది. ఆ త‌ర్వాత త‌న‌ను బెదిరిస్తున్నది క్యాబ్ డ్రైవ‌రే అన్న విష‌యం గుర్తించిన మ‌హిళ.. అత‌న్ని గ‌ట్టిగా నిల‌దీసి హెచ్చ‌రించింది.

ఈ క్ర‌మంలో మ‌రింత రెచ్చిపోయిన కిర‌ణ్‌కుమార్.. ఇప్పుడు నిజంగానే రహస్యాలన్నీ అందరికీ చెప్పేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆమె త‌న వ‌ద్ద ఉన్న 960 గ్రాముల బంగారాన్ని అత‌నికి ఇచ్చేసింది. అయినా అత‌ను ఇంకా బెదిరింపులు కొన‌సాగిస్తుండ‌టంతో రామ‌మూర్తిన‌గ‌ర పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌ను వివిధ చోట్ల తాక‌ట్టుపెట్టిన న‌గ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News