కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు..నెక్స్ట్ తెలంగాణలో నా ?

కర్నాటకలో బస్సు టికెట్ ఛార్జీలను 15శాతం పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2025-01-02 21:48 IST

కర్నాటకలో బస్సు టికెట్ ఛార్జీలను 15శాతం పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్​కే పాటిల్ తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ , నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ , బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ రవాణా కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలు 15శాతం పెంచారు. " ఈ నాలుగు ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్లలో పదేళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం రూ.9.16కోట్లు ఉండేది. ఇప్పుడు అది రూ.13.21 కోట్లకు పెరిగింది. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు రూ.12.95 కోట్లు నుంచి రూ.18.36 కోట్లు. అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని హెచ్​కే పాటిల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.కర్ణాటకలో అమలువుతున్న ఫ్రీ బస్సు పథకం 'శక్తి' నాన్​-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని పాటిల్ చెప్పారు.

రూ.2000 కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. అయితే 13శాతం, 15శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ రేట్లను పరిశీలించి 15శాతం పెంచాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.ఇంకోవైపు ఈ ఛార్జీల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. పంచ భాగ్య పథకాల ముసుగులో ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ట్వీట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్మించారు. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ సైతం ఈ అంశంపై ఇలా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దాదాపు ఏడాదిన్నర పైగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్​ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకం తీసుకొచ్చింది. రాబోయే రోజులో తెలంగాణలో కూడ బస్సు టికెట్ ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News