నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయం.. త్వరలోనే ప్రారంభించనున్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్

నాగ్‌పూర్ కార్యాలయ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని.. దీంతో పాటు పూణే, ఔరంగాబాద్‌లో స్థలాలను ఎంపిక చేశామని.. త్వరలోనే అక్కడ కూడా నిర్మాణం మొదలవుతుందని మాణిక్ కదం తెలిపారు.

Advertisement
Update:2023-06-06 09:07 IST

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను దేశవ్యాప్తంగా విస్తరించాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలోపేతం అవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు చోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యింది. అన్ని హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నాగ్‌పూర్ కార్యాలయాన్ని త్వరలోనే పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం వెల్లడించారు.

నాగ్‌పూర్ కార్యాలయ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని.. దీంతో పాటు పూణే, ఔరంగాబాద్‌లో స్థలాలను ఎంపిక చేశామని.. త్వరలోనే అక్కడ కూడా నిర్మాణం మొదలవుతుందని మాణిక్ కదం తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తున్నదని.. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం అద్భుతంగా సాగుతోందన్నారు. పార్టీ పట్ల చాలా మంది ఆకర్షితులై స్వచ్చంధంగా చేరుతున్నట్లు మాణిక్ కదం అన్నారు.

తెలంగాణ మాడల్‌ను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలోని ఏ రాజకీయ పార్టీతోనూ ప్రజల జీవితం మారిపోలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు, వాస్తవిక వికాసం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మాణిక్ కదం అన్నారు. ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోనే అవన్నీ సాధ్యమని నమ్ముతున్నట్లు చెప్పారు. తెలంగాణ తొమ్మిదేళ్లలోనే దేశానికి తలమానికంగా నిలిచింది. మహారాష్ట్రలో అన్ని వనరులు ఉన్నా ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు.

ఐదు రోజుల్లోనే మహారాష్ట్రలో 1 లక్షా 88 వేల మంది స్వచ్చంధంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారని మాణిక్ కదం చెప్పారు. దేశంలో అతి స్వల్ప కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో డిజిటల్ మెంబర్‌షిప్ నమోదు చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మాణిక్ కదం తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News