అదానీ స్కాంపై JPC వేయాలంటూ పార్లమెంట్‌లో వరసగా 6వ రోజు నిరసనకు దిగిన‌ BRS ఎంపీలు

ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, ఆప్, ఇతర పార్టీల ఎంపీలతో పాటు BRS ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు.

Advertisement
Update:2023-03-20 16:11 IST

హిండెన్‌బర్గ్-అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులతో కలిసి బీఆర్‌ఎస్ సభ్యులు సోమవారం వరుసగా ఆరో రోజు పార్లమెంట్ లోపల నిరసనలు చేపట్టారు.

ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.

ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, ఆప్, ఇతర పార్టీల ఎంపీలతో పాటు BRS ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు.

అదానీ గ్రూప్‌పై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనలను కొనసాగించడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఎంపీలు ర్యాలీ చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News