యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు ర‌ద్దు

బాల్య వివాహాలను నిరోధించడం కోసం యువతుల పెళ్లి వయసును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

Advertisement
Update:2024-06-09 10:05 IST

యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు మురిగిపోయింది. యువతుల వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచుతూ 2021 డిసెంబరులో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 17వ లోక్‌సభ ఇటీవల రద్దవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

బాల్య వివాహాలను నిరోధించడం కోసం యువతుల పెళ్లి వయసును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు– 2021 పేరుతో 17వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపించారు. అది పరిశీలనలో ఉండగానే లోక్‌సభ రద్దయింది. దీంతో బిల్లు మురిగిపోయినట్టయింది. ఈ బిల్లు ద్వారా యువతుల వివాహ వయసును పురుషులతో సమానంగా 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావించింది.

Tags:    
Advertisement

Similar News