కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు భారీ షాక్

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడాస్కామ్ కేసుకు సంబంధించిన రూ. 300 కోట్ల ఆస్తుల జప్తుకి ఈడీ ఆదేశించింది

Advertisement
Update:2025-01-17 21:49 IST

కర్ణాటక సీఎం సిద్దరామయ్య భారీ షాక్ తగిలింది. ముడాస్కామ్ కేసుకు సంబంధించిన రూ. 300 కోట్ల విలువ కలిగిన 142 స్థిరాస్తులను జప్తు కి ఈడీ ఆదేశించింది. ఈ ఆస్తులు ముడాస్కామ్‌లో సిద్దరామయ్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈడీ లింక్ చేసింది. భూముల వ్యవహారంలో సిద్ధరామయ్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది.

ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్‌ స్వామితో పాటు మరో వ్యక్తి పేర్లను జాబితాలో చేర్చింది. సిద్ధరామయ్య భార్య పార్వతి.. వివిధ ప్రాజెక్టుల కోసం మైసూరులోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తన 3.16 ఎకరాల భూమిని ఇవ్వడంతో ముడా పరిధిలోని 14 ప్లాట్లను ఆమెకు కేటాయించారు. ఇందులో రూ.45 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి

Tags:    
Advertisement

Similar News