టీ20 కప్‌ కొట్టిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా

ప్రపంచ కప్‌ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ మొత్తాన్ని బహుమతిగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలియజేసిన జై షా.. టీమ్‌ ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement
Update:2024-07-01 08:44 IST

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో చిరస్మరణీయ విజయం ద్వారా భారత్‌కు ప్రపంచ కప్‌ను సాధించిన జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆదివారం ఒక ప్రకటన చేశారు. దీనికి ముందు దాదాపు 11 ఏళ్ల క్రితం 2013లో భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి పలుమార్లు ఊరిస్తూ దూరమైన ఐసీసీ ట్రోఫీని సుదీర్ఘ విరామం తర్వాత జట్టు సమష్టి కృషితో సాధించింది.

దక్షిణాఫ్రికా జట్టుతో శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు 7 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సాధించి టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ కప్‌ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ మొత్తాన్ని బహుమతిగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలియజేసిన జై షా.. టీమ్‌ ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. టోర్నమెంట్‌ ఆసాంతం జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. అద్భుతమైన విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News