బాలసాహెబ్‌ ఐడియాలజీని మర్చిపోలే

బీజేపీకి ఉద్దవ్‌ ఠాక్రే కౌంటర్‌

Advertisement
Update:2024-11-09 21:21 IST

బీజేపీతో మూడు దశాబ్దాలుగా స్నేహంతో ఉన్నామని.. అప్పుడే గుర్తింపు కోల్పోని శివసేన పార్టీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ ఎందుకు మారుతుందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ టార్గెట్‌ గా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌ కు మరో వర్షన్‌ శివసేన (యూబీటీ) అని బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారానికి వచ్చి తాము బాల సాహెబ్‌ ఐడియాలజీని మర్చిపోయామని విమర్శలు చేస్తున్నారని, మేము ఎప్పుడు ఐడియాలజీ వీడలేదన్నారు. తాము బీజేపీని మాత్రమే వదిలేశాం తప్ప ఐడియాలజీని కాదన్నారు. గతంలో బీజేపీతో ఉన్నాం.. ఇప్పుడు కాంగ్రెస్‌ తో ఉన్నాం.. కాంగ్రెస్‌ తో ఉన్నంత మాత్రాన ఆ పార్టీలాగా మారిపోబోమన్నారు. మహారాష్ట్ర నుంచి భారీ ప్రాజెక్టులన్నీ గుజరాత్‌ కు తరలిపోతున్నాయని ఆరోపించారు. ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వం అమలు చేస్తున్న లడ్కీ బహిన్‌ స్కీమ్‌ పై విమర్శలు ఎక్కు పెట్టారు. గతంలో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ.. ఈ స్కీం పేరుతో ఒక్కొక్కరి బ్యాంక్‌ ఎకౌంట్‌ లో రూ.1500 జమ చేస్తుందన్నారు. ఈసారి మళ్లీ వాళ్లను గెలిపిస్తే ఆ మొత్తం 15 పైసలకు తగ్గిపోతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చే హామీలన్ని ఇలాగే ఉంటాయని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News