ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ పట్టిపీడిస్తున్నయ్‌

బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

Advertisement
Update:2024-11-15 17:27 IST

దేశాన్ని మూడు వందల ఏళ్ల క్రితం పాలించిన ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ పట్టిపీడిస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశాన్ని పాలించినప్పుడు నోటి మాటతో భూములు ఇచ్చి ఉండొచ్చని.. ఇప్పుడు కుప్పలు కుప్పలుగా డాక్యుమెంట్స్‌తో వచ్చి ఆ భూములు తమవని కొందరు అంటున్నారని తెలిపారు. దేశంలో సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం.. ఎవరైనా సుప్రీం కోర్టు ఆదేశాలనే పాటించాలి.. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వక్ఫ్‌ బోర్డు తీసుకువచ్చిందన్నారు. సుప్రీం కోర్టుకు మించిన అధికారాలను వక్ఫ్‌ బోర్డుకు ఇచ్చారని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు అనేది క్రూరమైన హాస్యమని.. నవ్వాలో.. ఏడవాలో.. బాధపడాలో తెలియని పరిస్థితి అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందుతుందని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజానికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News