ఆధార్ తరహాలో అపార్ కార్డు! ఎవరి కోసమంటే..

ఆధార్‌ కార్డ్ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ‘అపార్’ పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది స్టూడెంట్స్‌కు లైఫ్ టైమ్ ఐడీగా పనికొస్తుందట.

Advertisement
Update:2023-10-17 12:45 IST

ఆధార్‌ కార్డ్ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ‘అపార్’ పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది స్టూడెంట్స్‌కు లైఫ్ టైమ్ ఐడీగా పనికొస్తుందట. వివరాల్లోకి వెళ్తే..

దేశవ్యాప్తంగా విద్యార్థులందరి డేటాను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చే విధంగా ‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ కార్డు’ అనే కొత్త రకమైన గుర్తింపు కార్డును తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యా శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ గుర్తింపు కార్డుని అపార్.. అంటే ‘ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(ఏపీఏఏఆర్‌)’గా పిలువనున్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.

అపార్‌ నెంబర్‌ స్టూడెంట్స్‌కు లైఫ్ టైం ఐడీగా పనికొస్తుంది. ఇందులో భాగంగా స్టూడెంట్ అకడమిక్‌ వివరాలు, మార్కులు, సర్టిఫికెట్లు, చదివిన, చదువుతున్న విద్యాసంస్థల వివరాలు అన్నీ రికార్డ్ అవుతాయి. భవిష్యత్తులో ఉన్నత విద్యకు, ప్రభుత్వ ఉద్యోగాలకు, స్కాలర్‌‌షిప్పులకు, ఇతర సర్వీసులకు అప్లై చేసుకునేటప్పుడు ప్రతిసారీ అన్నివివరాలు ఎంటర్ చేసే పనిలేకుండా ఒక్కనెంబర్‌‌తోనే స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ నమోదు చేసుకునే విధంగా ఈ కార్డు ఉపయోగపడనుంది. దేశంలోని విద్యార్థులకు సొంత క్యూఆర్‌ కోడ్‌ లాగా ఇది పనిచేస్తుందట.

ఈ కొత్త గుర్తింపు కార్డులకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సమ్మతి తీసుకోవాలని పాఠశాలలను విద్యాశాఖ కోరింది. అపార్ ద్వారా సేకరించిన విద్యార్థుల డేటా రహస్యంగా ఉంటుందని, కేవలం ప్రభుత్వ రంగ సంస్థలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని పేర్కొంది.


Tags:    
Advertisement

Similar News