బీజేపీ పాలనలో మతకలహాలుండవ‌న్న అమిత్ షా.... మతాలహాల‌ లెక్కలు విప్పిన కపిల్ సిబల్

"బీజేపీ పాలనలో మతకలహాలు జరగవు అని అమిత్ షా చెప్పడం మరో జుమ్లా" అన్నారు కపిల్ సిబల్. బీజేపీ పాలనలో జరిగిన మతకలహాల గణాంకాలను వెల్లడించారు.

Advertisement
Update:2023-04-03 15:30 IST

బిజెపి పాలనలో అల్లర్లు జరగవని హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్ సోమవారం "మరో జుమ్లా" అని అభివర్ణించారు. కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం హయాంలో మత హింసకు సంబంధించిన గణాంకాలను ఆయన ఉదహరించారు.

బీహార్‌లోని నవాడా జిల్లా పరిధిలోని హిసువాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, “2024లో ఎన్నికల్లో బీహార్లోని మొత్త 40 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకరండి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మెజార్టీ ఇవ్వండి. మేము అధికారంలోకి వచ్చాక‌ అల్లరిమూకలను తలకిందులుగా వేలాడదీస్తాం. మా పాలనలో మతకలహాలు జరగవు," అని షా చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందిస్తూ, "బీజేపీ పాలనలో మతకలహాలు జరగవు అని అమిత్ షా చెప్పడం మరో జుమ్లా" అన్నారు. బీజేపీ పాలనలో జరిగిన మతకలహాల గణాంకాలను వెల్లడించారు. “ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB) డేటా ప్రకారం 2014-2020 మధ్య ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యాణా రాష్ట్రాల్లో 5415 మతకలహాలు నమోదయ్యాయి. ఒక్క‌ 2019లోనే - 25 మతకలహాలు జరిగాయి. బీజేపీ పాలనలోనే అత్యధిక మతకలహాలు జరిగాయని కపిల్ సిబాల్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News