వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ విరాళం.. ఎంతంటే!

వయనాడ్‌ బాధితుల కోసం ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ఆర్థిక సాయం ప్రకటించారు. నయనతార దంపతులు 20 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించారు.

Advertisement
Update:2024-08-04 16:49 IST

కేరళ వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి నష్టపోయిన బాధితులకు నటుడు అల్లు అర్జున్ అండగా నిలిచారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన బన్నీ.. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేశారు అల్లు అర్జున్. కేరళలో అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ ట్వీట్ ఇదే -

వయనాడ్‌లో జరిగిన ఘటన చాలా బాధ కలిగించింది. కేరళ నాకు చాలా ప్రేమను ఇచ్చింది. నా వంతు సాయం నేను చేయాలనుకుంటున్నాను. అందుకే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నాను. మీ అందరి భద్రత కోసం ప్రార్థిస్తాను అని ట్వీట్ చేశారు.

వయనాడ్‌ బాధితుల కోసం ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ఆర్థిక సాయం ప్రకటించారు. నయనతార దంపతులు 20 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించారు. నటుడు టోవినో థామస్‌ రూ.25 లక్షల సీఎం సహాయ నిధికి అందించనున్నట్లు వెల్లడించారు. వీరితో పాటు మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్, ఫహద్ ఫాసిల్, విక్రమ్, సూర్య, కార్తీ, జ్యోతిక, రష్మిక మందన విరాళాలు ప్రకటించారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 350 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు నాలుగు ఊర్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం SDRF, NDRF బృందాలతో పాటు స్థానిక రెస్క్యూ టీమ్స్‌ శ్రమిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News