మన్మోహన్ సింగ్ స్మారకం కోసం కేంద్రం భూమి కేటాయింపు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్మారకం ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న ఈ భూమిని మన్మోహన్ సింగ్ స్మారకం కోసం కేంద్రం భూమి కేటాయించింది

Advertisement
Update:2025-02-04 18:50 IST

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్మారకం కోసం ఎన్డీయే సర్కార్ భూమిని కేటాయించింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్మారకం కోసం ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న ఈ భూమిని మన్మోహన్ ఫ్యామిలీ సభ్యులకు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ కోసం సింగ్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయనున్న ట్రస్ట్‌ కోసం ప్రభుత్వం వేచి చూస్తోందని నేషనల్ మీడియాలో కథనాలు తెలిపాయి. ఒకసారి అది ఏర్పాటైన తర్వాత ఆ స్థలాన్ని అప్పగించనుంది. అంతేగాకుండా నిర్మాణం నిమిత్తం రూ.25 లక్షలు ఇవ్వనుంది.

కాగా.. డిసెంబర్‌లో మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఆయన స్మారకం ఏర్పాటు కోసం భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఢిల్లీ రాజ్‌ఘాట్‌ ప్రాంగణంలోని రాష్ట్రీయ సమితి కాంప్లెక్స్‌లో ప్రణబ్ ముఖర్జీ స్మారకం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ విషయాన్ని గత నెల ఆయన కుమార్తె శర్మిష్ఠముఖర్జీ ధ్రువీకరించారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News