అదానీ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు, నిపుణుల కమిటీ ఏర్పాటు

అదానీ గ్రూపు సెక్యూరిటీ చట్టాన్ని ఉల్లంఘించిందా? లేదా? రిలేటెడ్ పార్టీ లావాదేవీల సమాచారాన్ని వెల్లడించడంలో విఫలమైందా ? అన్న అంశాలను తేల్చాలని సుప్రీం కోర్టు కమిటీని కోరింది. కనీస పబ్లిక్ వాటా కలిగి ఉండాలనే నిబంధనలను ఉల్లంఘించినదీ లేనిదీ గుర్తించాలని కూడా ఆదేశించింది.

Advertisement
Update:2023-03-02 12:53 IST

అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై విచారణకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. విచారణ‌ కోసం రిటైర్డ్ జడ్జి AM సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

AM సప్రే నేతృత్వంలోని ఈ విచారణ కమిటీలో OP భట్, JP దేవ్‌ధర్, KV కామత్, నందన్ నీలేక‌ని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ లు సభ్యులుగా ఉంటారు.

అదానీ గ్రూపు సెక్యూరిటీ చట్టాన్ని ఉల్లంఘించిందా? లేదా? రిలేటెడ్ పార్టీ లావాదేవీల సమాచారాన్ని వెల్లడించడంలో విఫలమైందా ? అన్న అంశాలను తేల్చాలని సుప్రీం కోర్టు కమిటీని కోరింది. కనీస పబ్లిక్ వాటా కలిగి ఉండాలనే నిబంధనలను ఉల్లంఘించినదీ లేనిదీ గుర్తించాలని ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ , జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులను ప్రకటించింది.

అదానీ స్కాంపై విచారణ జరపాలని పలువురు పిటిషనర్ల అభ్యర్థన మేరకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో ఇచ్చిన విచారణ కమిటీ సభ్యుల పేర్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కమిటీ పారదర్శకంగా ఉండేందుకు అందులో సభ్యులను తామే నిర్ణయిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఆ మేరకు ఈ రోజు సుప్రీం కోర్టు కమిటీ సభ్యులను ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News