గేమ్​జోన్​లో అగ్నిప్రమాదం, 22 మంది మృతి, ఎక్కడంటే..

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది.​ రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్​జోన్​లోని శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులు సహా 22మంది మరణించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement
Update:2024-05-25 21:48 IST

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది.​ రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్​జోన్​లోని శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులు సహా 22మంది మరణించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

గేమింగ్ జోన్ కావటంతో మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. భారీ ప్రమాదంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. గేమింగ్ జోన్‌లో తక్షణమే రెస్కూ, రిలీఫ్ కార్యకలాపాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించారు.

 

శనివారం సాయంత్రం బిజీ బిజీగా ఉన్న గేమింగ్ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.వేసవి సెలవుల కారణంగా ఘటనా స్థలంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో చిన్నారులతో సహా 22 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగే సమయానికి గేమింగ్ జోన్‌లో మొత్తం 60 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందిని రక్షించారు. మంటలు మొదలవ్వటానికి కారణాలేంటో ఇంకా తెలియలేదు. గేమింగ్ జోన్ పూర్తిగా చెక్కతో నిర్మించడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది.

 

బాధిత కుటుంబాల ఆక్రందనలతో ఆ ప్రదేశం హృదయవిదారకంగా తయారయ్యింది. సంఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గేమింగ్ జోన్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News