Telangana, Andhra Pradesh Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్
Telangana, Andhra Pradesh Live Updates: ఈరోజు 11 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్ : మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.
Telangana, Andhra Pradesh Live Updates: ఈరోజు 11 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్ : మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.
Hyderabad weather report: రానున్న ఏడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం మాత్రం కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
విశాఖ: ప్రధాని నరేంద్రమోడీకి భారీ ర్యాలీతో స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు..ఈరాత్రికి ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో బస చేయనున్న ప్రధాని మోడీ..
హైదరాబాద్ లో ప్రధాని పర్యటన నేపథ్యంలో రేపు బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు పంజాగుట్ట- గ్రీన్ లాండ్స్- రసూల్ పురా మార్గం, సోమాజిగూడ-రాజ్ భవన్- ఖైరతాబాద్ జంక్షన్ మార్గాల బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు.
తెలంగాణ లైవ్ అప్డేట్స్: నిజాం కళాశాల విద్యార్థినుల ఆందోళన పై మంత్రి సబితా ట్వీట్
హైదరాబాద్ లైవ్ న్యూస్ : హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. మియాపూర్-ఎల్బీ నగర్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో సుమారు 30 నిమిషాలకు పైగా సేవలు నిలిచిపోయాయి.
Car race event in Hyderabad: హైదరాబాద్‌లో ఫార్ములా వన్ మాదిరి కార్ రేస్ జరగబోతోంది. ఈ ఈవెంట్ పేరు ఫార్ములా ఈ-ఫిక్స్ కార్ రేస్. దీనికోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌ను రెడీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
లైవ్ అప్డేట్స్: రాజీవ్ హత్య కేసులో ఆరుగురు నిందితుల విడుదలకు 'సుప్రీం' ఆదేశం - పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్: వచ్చే ఏడాది జనవరి 27నుండి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం అయి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగనుంది.
తెలంగాణ లైవ్ అప్డేట్స్: తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో హైదరాబాద్ లో కొన్నిచోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు కనపడుతున్నాయి. చేనేతపై 5శాతం జీఎస్టీని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
చెన్నై నుంచి మైసూరు వరకు నడిచే వందేభారత్ రైలును ఈ రోజు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇది దక్షిణాదిలో మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు. - పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి