ఆ సినిమాలో నుంచి సమంతని తీసేశారా?

నిజానికి ఈ సినిమాలో కృతి శెట్టి ఉందా లేదా అనే విషయం మీద చిత్ర వర్గాలు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే సమంతని మాత్రం ఈ సినిమా నుంచి తీసేయడం లేదని తెలిసింది.

Advertisement
Update:2022-12-06 18:44 IST

గత కొన్ని రోజులుగా సమంత మీద ఆమె కెరీర్ మీద అనేక ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. నిజానికి సమంత కెరీర్ గాడిలోనే ఉంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకైతే సమంత తన స్టార్‌డమ్‌ని నిలుపుకుంది. యశోద అనే సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకొని, తన కెరీర్ మీద ఆశలు సజీవంగా నిలుపుకుంది అని చెప్పచ్చు. ఈ తరుణంలో ఆమెని ఒక ప్రతిష్టాత్మక సినిమాలో నుంచి తీసేశారు అనే వార్తలు అభిమానులని కలవర పెడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే సమంత ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఆమె హెల్త్ కారణంగా ఈ షూట్ కొన్ని రోజులు వాయిదా పడిన సంగతి మనకి తెలిసిందే. చిత్ర యూనిట్ ఆల్రెడీ కొంత భాగం షూట్ చేశాక, సమంత అనారోగ్యం పాలవ్వడం జరిగింది. అయినా కానీ షూట్ ప్రోగ్రెస్‌కి పెద్ద గా ఇబ్బంది కలగలేదని సమంత తరపువారు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో కృతి శెట్టిని ఈ సినిమాలోకి తీసుకుంటున్నారు అనే వార్త ఒకటి హల్‌చ‌ల్‌ చేస్తుంది. నిజానికి ఈ సినిమాలో కృతి శెట్టి ఉందా లేదా అనే విషయం మీద చిత్ర వర్గాలు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే సమంతని మాత్రం ఈ సినిమా నుంచి తీసేయడం లేదని తెలిసింది.

ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ పాత్రని పోషిస్తూ ఉండగా, కృతి శెట్టిని ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం. సమంత కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News