ఐఆర్‌‌సీటీసీ డైలీ అరకు టూర్.. వివరాలివే..

విశాఖపట్నంలో ఉద‌యాన్నే విస్టాడోమ్ కోచ్‌ ట్రైన్ ఎక్కడంతో అరకు టూర్ మొదలవుతుంది. ఈ కోచ్‌లో ఇరువైపులా గ్లాస్ ఉంటుంది. సొరంగాలు, వంతెనలు, జలపాతాలు, అరకు లోయ అందాలు ఆస్వాదిస్తూ సాగే రైలు ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుంది.

Advertisement
Update:2023-09-22 11:06 IST

అరకు అందాల్ని చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌‌సీటీసీ.. అరకు టూర్‌‌ను ప్లాన్ చేసింది. విశాఖపట్నం నుంచి ఈ టూర్ ప్రతీ రోజు మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

కేవలం అరకు అందాల కోసమే ఐఆర్‌సీటీసీ ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ద్వారా ఒకేరోజులో అరకులోని అన్ని ప్రాంతాలను ఆస్వాదించొచ్చు. ఈ టూర్ వెళ్లాలనుకునేవాళ్లు ముందుగా విశాఖపట్నం చేరుకోవాలి. విశాఖపట్నం నుంచి ఉద‌యాన్నే బయలుదేరి అరకు అందాలు చూసి మళ్లీ సాయంత్రానికి తిరిగి విశాఖపట్నం చేరుకోవచ్చు.

విశాఖపట్నంలో ఉద‌యాన్నే విస్టాడోమ్ కోచ్‌ ట్రైన్ ఎక్కడంతో అరకు టూర్ మొదలవుతుంది. ఈ కోచ్‌లో ఇరువైపులా గ్లాస్ ఉంటుంది. సొరంగాలు, వంతెనలు, జలపాతాలు, అరకు లోయ అందాలు ఆస్వాదిస్తూ సాగే రైలు ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రయాణికులు ఉదయం 11 గంటలకు అరకు చేరుకుంటారు. ఆ తర్వాత ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గం ద్వారా అరకు విలేజ్ చేరుకుంటారు. అక్కడ ట్రైబల్ మ్యూజియం, టీ గార్డెన్స్, అరకు లోయలోని ఇతర పర్యాటక ప్రాంతాలు, ధింసా డ్యాన్స్ వంటివి తిల‌కిస్తారు. తర్వాత లంచ్ చేసి సాయంత్రానికి అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహల వంటివి కవర్ చేసుకుని తిరిగి విశాఖపట్నం బయలుదేరతారు. రాత్రికల్లా విశాఖపట్నం చేరుకుంటారు.

ఐఆర్‌సీటీసీ అరకు టూర్ ప్యాకేజీ ధరలు రూ.2,130 నుంచి మొదలవుతాయి. స్లీపర్ క్లాస్, సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ కోచ్‌కు గ్లాస్ విండోస్ ఉంటాయి. టూర్ ప్యాకేజీలో భాగంగా వైజాగ్ నుంచి అరకు వరకు రైలు ప్రయాణం, అరకు నుంచి వైజాగ్ వరకు బస్సు ప్రయాణం, నాన్ ఏసీ బస్సులో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.

*

Tags:    
Advertisement

Similar News