చైనా అధ్యక్షుడిగా మళ్ళీ జిన్ పింగ్

చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం 5.5 శాతం పెంపు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న చైనా ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. కఠినమైన కోవిడ్ నియంత్రణల వల్ల కేవలం మూడు శాతం మాత్రమే అభివృద్ది సాధించ‌గలిగింది.

Advertisement
Update:2023-03-10 15:14 IST

చైనా అధ్యక్షుడిగా   జిన్‌పింగ్ మూడోసారి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక అతను జీవిత కాల అధ్యక్షుడిగా ఉండటానికి దాదాపు దారి క్లియర్ అయినట్టే.

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను అతను ఎలా పరిష్కరిస్తాడనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం 5.5 శాతం పెంపు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న చైనా ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. కఠినమైన కోవిడ్ నియంత్రణల వల్ల కేవలం మూడు శాతం మాత్రమే అభివృద్ది సాధించ‌గలిగింది.

2023 సంవత్సరానికి చైనా సుమారు ఐదు శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇది ఈ దశాబ్ద కాలంలో అత్యల్పం.

మరో వైపు సాంకేతిక రంగంపై ఆధిపత్యం కోసం అమెరికాతో తీవ్రంగా పోటీ ఎదుర్కొంటున్నది చైనా. స్వదేశంలో వృద్ధి మందగించడంతో అంతర్జాతీయంగా మరింత ఒత్తిడికి లోనవుతుంది.

ఇటీవలి సంవత్సరాలలో చైనా, అమెరికా మధ్య సంబంధాలు దారుణంగాగా క్షీణించాయి, వాణిజ్యం, మానవ హక్కులు, కోవిడ్ -19 మూలాలు వంటి అనేక సమస్యలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.

తాజాగా అమెరికా గగనతలంపై చైనా బెలూన్ ను అమెరికా పేల్చేయడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తలను రెచ్చగొట్టింది. చైనా పర్యటన‌కు వెళ్ళవలసిన US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అది చైనా నిఘా బెలూన్ అంటూ అమెరికా ఆరోపణను చైనా ఖండించింది.

యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు చైనా ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విరుచుకపడ్డారు.

మరో వైపు తైవాన్ సమస్య రగులుతూనే ఉంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తుండగా దాన్ని స్వతంత్ర దేశంగా అమెరికా గుర్తించడం కూడా చైనాకు తలనొప్పిగానే మారింది.

మూడవ సారి అధ్యక్షుడిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టిన జిన్ పింగ్ ఈ సమస్య‌లను ఎలా ఎదుర్కొంటారన్నది ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News