హెచ్‌బొల్లా కొత్త చీఫ్‌ ఖాసీంపై ఇజ్రాయెల్‌ ఏమన్నదంటే?

దీనిపై సంచలనంగా మారిన ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి చేసిన పోస్ట్‌

Advertisement
Update:2024-10-30 11:09 IST

హెజ్‌బొల్లా, హమాస్‌లపై ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకరదాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉన్నది. ఇప్పటికే ఈ మిలిటెంట్‌ సంస్థల అగ్రనేతలను ఐడీఎఫ్‌ హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెచ్‌బొల్లా కొత్త చీఫ్‌గా షేక్‌ నయీంఖాసీంను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది. కొత్త చీఫ్‌ ఎంతోకాలం ఉండడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించడం విశేషం.

షేక్‌ ఖాసీం ఫొటోను షేర్‌ చేసిన ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌.. 'ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. సుదీర్ఘకాలానికి కాదు' అని రాసుకొచ్చారు. ఇక మరో పోస్టులో 'కౌంట్‌డౌన్‌ మొదలైంది' అంటూ పేర్కొన్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఖాసీంను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్‌ మరిన్ని భీకర దాడులు చేయవచ్చనే సంకేతాలను ఇచ్చారు.

ఇజ్రాయెల్‌తో 2006 యుద్ధం తరువాత నస్రల్లా ఎక్కువగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత అత్యంత సీనియర్ హిజ్ బొల్లా అధికారి షేక్‌ నయీంఖాసీం బహిరంగంగా కనిపించడం కొనసాగించారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా మరణించినప్పటి నుంచి, ఖాసీం మూడు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. ఆయన 30 సంవత్సరాలకు పైగా హెజ్‌బొల్లాలో సమూహంలో భాగంగా ఉన్నాడు. అక్టోబరు 8న హెజ్‌బొల్లా- ఇజ్రాయెల్ మధ్య వివాదంపై స్పందిస్తూ యుద్ధాన్ని మొదలుపెట్టిన వారు మొదట ఏడుస్తారని, హిజ్ బొల్లా మొదట ఏడవదని చెప్పారు. 

హెజ్‌బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్‌

మరోవైపులెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్ (ఐడీఎఫ్‌) విరుచుకుపడుతున్నది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హెజ్‌బొల్లాకు చెందిన 80 శాతం రాకెట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ అంచనా వేసింది. ఆ మఠా వద్ద ఇంకా 20 శాతం రాకెట్లు, క్షిపణులు మాత్రమే ఉన్నాయని ప్రధాని నెతన్యాహు కు ఐడీఎప్‌ నివేదించింది. ఇక లెబనాన్‌లో దౌత్య పరిష్కారం కోసం నెతన్యాహు సర్కార్‌ కీలక సమావేశం నిర్వహించింది.

గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు

గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర దాడులకు వందలాది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గాజా వ్యాప్తంగా 143 మంది, లెబనాన్‌లో 77 మందికి పైగా మరణించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. లెబనాన్‌లో భూతల దాడులకు వెళ్లి 33 మంది ఇజ్రాయెల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నఖౌరాలోని తమ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన రాకెట్‌ దాడిలో శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది. గాజాగాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని హమాస్‌ ప్రకటించింది.

ఇరాన్‌పై ఈసారి మా దెబ్బ గట్టిగానే ఉంటుంది: ఇజ్రాయెల్‌

ఇటీవల క్షిపణి దాడులు జరిగిన నేపథ్యంలో గత వారం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇంకోసారి దాడి చేస్తే ఇరాన్‌ను మళ్లీ ఎలా గట్టిగా దెబ్బకొట్టాలో బాగా తెలుసని లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హెర్జి హలేవి వ్యాఖ్యానించారు. హలేవి గత వారం దాడుల్లో పాల్గొన్న వారితో సమావేశం నిర్వహించారు. కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కనపెట్టామని, వాటిపై మరో సందర్భంలో గురిపెడుతామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News