విమానం కుప్పకూలి 18మంది మృతి

రన్‌వేపై టేకాఫ్‌ అవుతున్న సమయంలో స్కిడ్‌ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం అనంతరం విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Advertisement
Update: 2024-07-24 09:22 GMT

నేపాల్‌లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రమంలో శౌర్య ఎయిర్‌లైన్స్‌ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19మంది ఉండగా.. 18 మంది స్పాట్‌లోనే చనిపోయారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయపడ్డారు.

ఖాట్మండు నుంచి పోఖార్‌కు విమానం బయల్దేరింది. రన్‌వేపై టేకాఫ్‌ అవుతున్న సమయంలో స్కిడ్‌ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం అనంతరం విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా, ఫలితం లేకుండా పోయింది.

విమానంలో సంస్థకు చెందిన 19 మంది సాంకేతిక సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రయాణికులు ఎవరూ లేరు. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 18మంది డెడ్‌బాడీలను బయటకు తీశారు. విమానం పేలి పోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి వెళ్లాయి. ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News