హష్‌ మనీ కేసులో ట్రంప్‌ను దోషి..తేల్చిన న్యూయార్క్ కోర్టు

ట్రంప్‌ ఎలాంటి జరిమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సిన అవసరం లేదని న్యూయార్క్‌ కోర్టు జడ్జి తీర్పు

Advertisement
Update:2025-01-11 11:11 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలైన డొనాల్డ్‌ ట్రంప్‌కు హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ న్యాయమూర్తి శిక్ష విధించారు. అయితే ట్రంప్‌ ఎలాంటి జరిమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సిన అవసరం లేదని న్యూయార్క్‌ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. దోషిగా నిర్ధారణ అయి శిక్ష పడని తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. హష్‌ మనీ కేసులో తన లాయర్‌తో కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. తాను నిర్దోషినని, ఎలాంటి తప్పు చేయలేని మరోసారి న్యాయమూర్తి ముందు పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ కోణం ఉన్నదన్న ట్రంప్‌.. తన ప్రత్యర్థులు ఇలా చేశారని అన్నారు. అంతకుముందు తనకు శిక్ష ఖరారు చేస్తానంటూ న్యాయార్క్‌ కోర్టు ఆదేశాలను అడ్డుకోవాలంటూ ట్రంప్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు చుక్కెదురైంది. శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా తన సంస్థ అకౌంట్స్‌ తారు మారు చేసి ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా తనకు 1.30 లక్షల డాలర్లు ఇప్పించారు. స్టార్మీ డానియల్స్‌ సహా 22 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

ఇది డెమోక్రాట్ల నీజమైన ఆట 

హష్‌ మనీ వ్యవహారంలో ట్రంప్‌నకు న్యాయార్క్‌ జడ్జి బేషరతుగా విడుదల చేయాలని తీర్పు ఇచ్చిన విషయం విదితిమే. తాజాగా ఈ తీర్పుపై ట్రంప్‌ స్పందించారు. ఇది డెమోక్రాట్ల నీజమైన ఆట అని ఆయన పేర్కొన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. నాకు బేషరతు విడుదల ఇచ్చారు. ఇలాంటి కేసు ముందెన్నడూ లేదని లీగల్‌ స్కాలర్లు, నిపుణులు చెబుతున్నారు. ఈ స్కామ్‌ మొత్తం కొట్టి వేయడానికి అర్హమైనది. ఈ బూటకపు కేసుపై మేము అప్పీల్‌ చేస్తాం. అంతేకాక, ఒకప్పటి మన గొప్ప న్యాయవ్యవస్థపై అమెరిన్లు పెట్టుకున్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం అని ట్రంప్‌ రాసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News