ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న న్యూఇయర్‌ వేడుకలు

వేడుకల్లో ఉత్సహాంగా పాల్గొంటున్న వివిధ దేశాల ప్రజలు

Advertisement
Update:2025-01-01 12:43 IST

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఆయా దేశాల ప్రజలు సరికొత్త ఆశలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. 2025 సంవత్సరంలో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తున్నారు. బ్రెజిల్‌లోని కోపాకబానాలో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. బాణసంచా వెలుగుల మధ్య కేరింతలు కొడుడూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఉత్తరకొరియాలోనూ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ స్టేడియంలో జరిగిన ఉత్సవాలకు కిమ్‌ జోన్‌ ఉన్‌ తన కుమార్తె తో కలిసి హాజరయ్యారు. నూతన సంవత్సర వేడుకలను ప్రత్యక్ష ప్రసారాన్ని ఉత్తరకొరియా నిలిపివేసింది. కొత్త ఏడాది కిమ్‌ ఆయన కుమార్తె పాల్గొన్న ఫొటోలను ఉత్తరకొరియా మీడియా విడుదల చేసింది.

సిరియాలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణసంచా వెలుగు జిలుగులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. డమాస్కస్‌ లో జరిగిన వేడుకల్లో వేలాదిమంది పాల్గొన్నారు. బషర్‌ అల్‌ -అసద్‌ అధికారం నుంచి తప్పుకున్న నేపథ్యంలో సిరియా ప్రజలు కొత్త ప్రారంభాన్ని కాంక్షిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News