గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు..50 మంది మృతి

కాల్పుల విరమణపై చర్చలకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అంగీకరించిన కొద్దిసేపటికే దాడులు

Advertisement
Update:2025-01-03 11:53 IST

గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమం కొనసాగుతున్నది. తాజాగా నెతన్యాహు సైన్యం గాజా వ్యాప్తంగా చేసిన దాడుల్లో 50 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అనేకమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇజ్రాయెల్‌ స్వయంగా మానవతా జోన్‌ ప్రకటించినా మువాసీతో పాటు డెయిర్‌ అల్‌ బలాహహ, ఖాన్‌ యూనిస్‌ వంటి ప్రాంతాలపై వైమానిక దాడులను ఐడీఎఫ్‌ నిర్వహించింది. యుద్ధం వల్ల ఇతర ప్రాంతాల నుంచి బతుకు జీవుడా అంటూ వచ్చిన వేలాది మంది శరణార్థులకు మువాసీ ఆశ్రయం కల్పిస్తున్నది. సరైన సదుపాయాలు లేక, కఠిన చలిని తట్టుకోలేక అక్కడ రోజూ చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ఖతార్‌ ప్రతినిధులతో కాల్పుల విరమణపై చర్చలకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అంగీకరించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్‌ దాడులు చోటుచేసుకున్నాయి. మువాసీలో హమాస్‌కు చెందిన ఒక పోలీస్‌ అధికారిని చంపడానికి దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News