ఉక్రెయిన్ లో రష్యా ఓడిపోతే అణుయుద్దం తప్పదు... హెచ్చరించిన రష్యా మాజీ అధ్యక్షుడు

ఉక్రెయిన్‌కు మద్దతుపై చర్చించడానికి శుక్రవారం జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్ బేస్‌లో నాటో సైనిక కూటమి, ఇతర పాశ్చాత్య నాయకులు సమావేశం అవుతున్న నేపథ్యంలో మెద్వెదేవ్ ఈ హెచ్చరిక జారీచేశారు.

Advertisement
Update:2023-01-20 07:53 IST

 ఒకవేళ ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోతే అది అణుయుద్ధానికి దారితీస్తుందని వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడైన రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ నాటోను హెచ్చరించారు.

"సాంప్రదాయ యుద్ధంలో ఓటమి అణుయుద్ధానికి దారితీయవచ్చు" అని రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న మెద్వెదేవ్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.

మెద్వెదేవ్ 2008 నుండి 2012 వరకు రష్యాకు అధ్యక్షుడిగా పనిచేశారు.

ఉక్రెయిన్‌కు మద్దతుపై చర్చించడానికి శుక్రవారం జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్ బేస్‌లో నాటో సైనిక కూటమి, ఇతర పాశ్చాత్య నాయకులు సమావేశం అవుతున్న నేపథ్యంలో మెద్వెదేవ్ ఈ హెచ్చరిక జారీచేశారు.

మెద్వెదేవ్ వ్యాఖ్యలను రష్యా ప్రభుత్వం సమర్దించింది. అవి మాస్కో సూత్రాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. రష్యా తన‌ ఉనికికే ముప్పు వచ్చినప్పుడు అణు దాడికి అనుమతిస్తుంది. అని పేర్కొంది.

కాగా రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఇప్పటివరకు అతిపెద్ద అణు శక్తులు. ఈ రెండు దేశాలు ప్రపంచంలోని 90 శాతం అణు వార్‌హెడ్‌లను కలిగి ఉన్నాయి.

ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ప్రకారం, రష్యా వద్ద 5,977 అణు వార్‌హెడ్‌లు ఉండగా, యునైటెడ్ స్టేట్స్ వద్ద 5,428, చైనా వద్ద 350, ఫ్రాన్స్ వద్ద 290, యునైటెడ్ కింగ్‌డమ్ వద్ద 225 ఉన్నాయి.

రష్యాపై నాటో కూటమి సంప్రదాయ సైనిక ఆధిపత్యాన్ని కలిగి ఉండగా, అణ్వాయుధాల విషయానికి వస్తే కూటమిపై రష్యాకు అణు ఆధిపత్యం ఉంది.

Tags:    
Advertisement

Similar News