Infinix Smart 8 Pro | ఇన్‌ఫినిక్స్ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిష‌న్‌) ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌నిచేస్తుంది. 6.66 అంగుళాల హెచ్‌డీ+ (720x1,612 పిక్సెల్స్‌) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గ‌రిష్టంగా 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది.

Advertisement
Update:2024-01-27 13:37 IST

Infinix Smart 8 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) త‌న మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 50-మెగా పిక్సెల్స్ కెమెరా, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు (90Hz refresh rate) తోపాటు 6.6 -అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ( 6.6-inch IPS LCD screen)తో వ‌స్తుంది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ (MediaTek Helio G36 SoC) చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్‌13 యూఐ (గో ఎడిష‌న్‌) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 10వాట్ల చార్జింగ్ మద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. అయితే, ఈ ఫోన్ ధ‌ర ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ల‌తో వ‌స్తున్న‌ది. గెలాక్సీ వైట్ (Galaxy White), రెయిన్‌బో బ్లూ (Rainbow Blue), షైనీ గోల్డ్ (Shiny Gold), టింబ‌ర్ బ్లాక్ (Timber Black) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. దీని ధ‌ర రూ.10 వేల లోపే ఉండొచ్చున‌ని భావిస్తున్నారు.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిష‌న్‌) ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌నిచేస్తుంది. 6.66 అంగుళాల హెచ్‌డీ+ (720x1,612 పిక్సెల్స్‌) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గ‌రిష్టంగా 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ36 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా విత్ ఎఫ్‌/1.85 అపెర్చ‌ర్‌, డెప్త్ డేటా సేక‌ర‌ణ కోసం అన్ స్పెషిఫైడ్ ఏఐ లెన్స్ విత్ ఎఫ్‌/2.0 అపెర్చ‌ర్ ఉంటుంది. ఇంకా సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరాతో వ‌స్తోంది. ఏఐ లెన్స్ క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ క‌లిగి ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 2 టిగాబైట్స్ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 5, బ్లూటూత్ 5, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌, 3.5 ఆడియో జాక్‌, గైరోస్కోప్‌, ఈ-కంపాస్, యాక్సెల‌రోమీట‌ర్, అంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీతోపాటు సెన్స‌ర్లు ఉంటాయి. ఈ ఫోన్‌లో బ‌యోమెట్రిక్ అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. దీనివ‌ల్ల నిరంత‌రం ఫోన్ బ్యాట‌రీ చార్జింగ్ పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోతున్నా నెట్ బ్రౌజింగ్, సినిమాలు వాచ్, గేమ్స్ ప్లే చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News