Pawan Kalyan Remuneration: రెమ్యునరేషన్‌పై పవన్‌ను బాలయ్య ఇబ్బందులు పెట్టారా?

Pawan Kalyan Remuneration: బాలయ్య ఎన్ని విధాలుగా ప్రశ్నించినా పవన్ మాత్రం సమాధానం చెప్పలేదు. మొదటి సినిమాకు రెమ్యునరేషన్ లేకుండానే నటించినట్లు చెప్పారు. అయితే వంద రోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాతలు కొంత డబ్బులిచ్చారట. ఎంతిచ్చారని బాలయ్య అడిగితే సమాధానం చెప్పలేదు

Advertisement
Update:2023-02-04 13:17 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? ఇప్పుడు ఇదొక బ్రహ్మపదార్థంగా మారిపోయింది. సమాధానం లేని యక్షప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే పవన్ ఎక్కడ మాట్లాడినా సినిమాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న తనకు చంద్రబాబునాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకునే ఖర్మ ఏమి పట్టిందంటూ నిలదీస్తుంటారు. తనపై జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ప్యాకేజీ స్టార్ అనే ఆరోపణలకు సమాధానంగా పవన్‌పై విధంగా స్పందిస్తుంటారు.

ఒకసారి మాట్లాడుతూ తాను సినిమాల్లో సంపాదించిందంతా జనాల కోసమో ఖర్చు పెడుతుంటానని, జనాలకు పంచటానికి అప్పులు కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఇన్ కం ట్యాక్స్ కట్టడానికి పవన్ అప్పులు చేశాడని పార్టీ నేతలు చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునో ఏమో టీవీ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఇదే ప్రస్తావన తెచ్చారు. సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అని బాలయ్య డైరెక్టుగానే పవన్‌ను ప్రశ్నించారు.

అయితే బాలయ్య ఎన్ని విధాలుగా ప్రశ్నించినా పవన్ మాత్రం సమాధానం చెప్పలేదు. మొదటి సినిమాకు రెమ్యునరేషన్ లేకుండానే నటించినట్లు చెప్పారు. అయితే వంద రోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాతలు కొంత డబ్బులిచ్చారట. ఎంతిచ్చారని బాలయ్య అడిగితే సమాధానం చెప్పలేదు. గబ్బర్ సింగ్ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారన్న బాలయ్య ప్రశ్నకు కూడా పవన్ సూటిగా సమాధానం చెప్పలేదు. గబ్బర్ సింగ్ సినిమాకు పారితోషికం ఇచ్చారు కానీ తాను అడిగినంత కాకుండా నిర్మాతలు అనుకున్నంత మాత్రమే ఇచ్చారన్నారు.

మీరు అడిగింది ఎంత? నిర్మాతలు ఇచ్చింది ఎంత అని బాలయ్య అడిగినా పవన్ సమాధానం చెప్పలేదు. ఇదే విషయమై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకు పవన్ 50-80 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే పవన్‌కు ఆర్థిక‌ సమస్యలుండకూడదన్నారు. పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేకపోతున్నారని పవన్ చెప్పుకోవటం నమ్మేట్లుగా లేదని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఇంటర్వ్యూలో బాలయ్య రెమ్యునరేషన్‌పై ఎంతడిగినా పవన్ మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు.

Tags:    
Advertisement

Similar News