త్వరలో పవిత్రతో పెళ్లి.. లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన
'న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, మా ఇద్దరికీ మీ ఆశీస్సులు కావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పవిత్ర నరేష్.' అని నరేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నరేష్ ఒక వీడియో కూడా పంచుకున్నాడు.
నటి, తన స్నేహితురాలైన పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సీనియర్ నటుడు నరేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. విజయనిర్మల తనయుడు అయిన నరేష్ ఇదివరకే ఇద్దరికి విడాకులు ఇచ్చాడు. అనంతపురానికి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి బంధువు అయిన రమ్యతో నరేష్ కు మూడవ వివాహం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
నరేష్ నటి పవిత్రతో ఓ హోటల్ లో ఉండగా రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం తర్వాత నరేష్ పవిత్ర బంధంపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. పవిత్రకు ఇదివరకే పెళ్లి అయ్యింది. ఆమె ప్రస్తుతం మొదటి భర్తతో దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు నరేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
'న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, మా ఇద్దరికీ మీ ఆశీస్సులు కావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పవిత్ర నరేష్.' అని నరేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నరేష్ ఒక వీడియో కూడా పంచుకున్నాడు. ఆ వీడియోలో నరేష్ పవిత్రతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు లిప్ కిస్ పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతుండగా.. మరి కొందరు మాత్రం లిప్ కిస్ పెట్టుకుంటూ వీడియో విడుదల చేయడంపై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ రమ్య విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. విడాకులు మంజూరు కాగానే పవిత్రను నరేష్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.